శాంతా వసంతా ట్రస్ట్‌కు స్వాగతం

సర్వమానవులూ జన్మనిచ్చిన తల్లిదండ్రులకు, విద్యాబుద్దులు గరపిన గురువులకు ప్రత్యక్షంగా ఋణపడి వుంటారు. పరోక్షంగా సాటి మానవులకి, పర్యావరణానికి, ప్రకృతికి, సమాజానికి ఋణపడి వుంటారు. ఒక వ్యక్తి ఎదుగుదల, పురోగతి, అభివృద్ధి అన్నింటికీ అతని చుట్టూ ఉన్న సమాజం కూడా ఒక కారణం. తల్లిదండ్రులు, గురువుల ఋణం ఏదో రూపంలో చెల్లించుకునే అవకాశం ఉంటుంది. కానీ పర్యావరణానికి, ప్రకృతికి, సమాజానికి ఋణం తీర్చుకోవలసిన అవసరం చాలానే ఉంటుంది. ఆ ఋణం తీర్చుకోవడానికే ఈ ‘శాంతా – వసంతా ట్రస్టు’కు రూపకల్పన! అర్హులైన వారికి, అవసరమున్న వారికి చేయూత నిచ్చి శ్రేయోదాయక సమాజానికి ఒకింత తోడ్పడటమే ‘శాంతా – వసంతా ట్రస్టు’ ముఖ్య ధ్యేయం. శ్రేయోదాయక సమాజానికి మూలస్తంభాలు - విద్య, విజ్ఞానం, వినోదం, ఆరోగ్యం, కళాస్వరూపాలు. వీటికి చేయూత నివ్వడమే పరమోద్దేశం.

ట్రస్ట్ ఉద్దేశాలకు అనుగుణంగా విద్య, వైద్య, సంస్కృతి, సాంస్కృతుల కార్యక్రమాలకు, వాటి నిర్వహణకు, నిర్వహించేవారి అర్హత, అవసరం, శ్రద్ధ, నిబద్ధతలను గుర్తించి, తగు విధంగా సహాయ సహకారాలు అవకాశం ఉన్నమేరకు అందిస్తుంది.

కార్యక్రమాలు

వీడియోలు